Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుహాస్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ డ్రామా'. ఈ సినిమా ద్వారా మెహెర్ తేజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా కిరణ్, అనూషా నూతుల కథానాయికలు. లేటెస్ట్గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. వరుస హత్యలు చేస్తున్న ఓ సైకో కిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన రావడంతో పాటు వినూత్నంగా ఉందనే ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. అలాగే సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతుండటం విశేషం. అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ఉండబోతోందని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. దర్శకుడు మెహెర్ తేజ్ డైరెక్షన్ స్కిల్స్, సుహాస్ నటన వెరసి ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం గ్యారెంటీ' అని చెప్పారు. ''కలర్ ఫోటో' సినిమా తర్వాత సుహాస్ చేసిన చిత్రం కావడం, ఆ సినిమాలోని పాత్రకు పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పాత్ర, గెటప్ ఉండటంతో ట్రైలర్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆద్యంతం ఆసక్తి రేపుతున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటిస్తారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే : మెహెర్ తేజ్, షణ్ముఖ ప్రసాంత్, నిర్మాతలు : మెహెర్ తేజ్, తేజా కాసరపు, సంగీతం : అజరు, సంజరు, కెమెరా : వెంకట్.ఆర్ శాఖమూరి.