Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ గ్యాస్ సంఘటన స్పూర్తితో తెరకెక్కిన చిత్రం 'తప్పించుకోలేరు'. ఆర్.వి.జి మూవీజ్, ఎస్.వి.ఎల్.ఎంటర్ప్రైజెస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి), తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకత్వం వహించారు. సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ''కొత్తకథ', 'ఉసురు', 'అయ్యప్ప కటాక్షం' వంటి చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) ఈ చిత్రాన్ని కూడా అత్యద్భుతంగా తీశారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్ పర్యాటక సౌజన్యంతో చాలా భాగం భోపాల్, దాని పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. ఆగస్టు ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్‌లోనూ విడుదల చేస్తాం' అని తెలిపారు. దర్శక, నిర్మాత ఆర్.వి.జి మాట్లాడుతూ, 'ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై వచ్చిన అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ కంటే డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాం. వి.ఎస్.పి.తెన్నేటిగారి మాటలు, పాటలు, రాజేష్ రాజ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణలుగా నిలుస్తాయి' అని చెప్పారు. ఏవీఎల్.నరసింహం, నిట్టల మల్లాది భాస్కర్, మేజర్ ఆర్.వి.సుబ్బారావు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: వి.ఆర్.కంచి, ఛాయాగ్రహణం: ప్రసాద్ కె.నాయుడు, సంగీతం: రాజేష్ రాజ్.టి, మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి.