Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎన్నో ప్రేమ కథలు సినిమాలుగా వస్తుంటాయి. కానీ కొన్నే మనసును తాకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ప్రేమ కథే మా 'డియర్ మేఘ'' అని అంటున్నారు చిత్ర దర్శకుడు సుశాంత్ రెడ్డి. మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'డియర్ మేఘ'. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో వైభవంగా జరిగింది. కథానాయిక మేఘా ఆకాష్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, 'అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ వంటి ప్రతిభగల హీరో, హీరోయిన్లు మా సినిమాలో నటించారు. అలాగే ఈ చిత్రంతో మరో టాలెంటెడ్ హీరోయిన్ అర్జున్ సోమయాజులును పరిశ్రమకు పరిచయం చేస్తున్నాం.
ఈ సినిమాకి టెక్నీషియన్ల వర్క్ అస్సెట్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అలాగే హరి గౌర హిట్ మ్యూజిక్ అందించారు. రీసెంట్గా 'ఆమని ఉంటే పక్కన..' అనే పాటను విడుదల చేశాం.
ఆ పాటకు వన్ మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. మా సినిమాని త్వరలోనే థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. థియేటర్ల ఓపెనింగ్‌కి అనుమతి ఇచ్చి సినిమా ఇండిస్టీని ఎంకరేజ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కతజ్ఞతలు' అని చెప్పారు.
'ఈ చిత్రంలో మంచి సాంగ్స్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు సుశాంత్, నిర్మాత అర్జున్‌కి థ్యాంక్స్. 'ఆమని ఉంటే పక్కన ..'పాట వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ అవడం సంతోషంగా ఉంది. నా టెక్నీషియన్స్ అందరి సహకారం వల్లే ఇంత మంచి పాటలు చేయగలిగాను' అని సంగీత దర్శకుడు హరి గౌర అన్నారు.
దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, 'హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మీ హార్ట్‌ను టచ్ చేస్తుంది. ఆ ఫీల్‌తోనే సినిమా చూసి ఇంటికెళ్తారు' అని తెలిపారు. హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకెంతో స్పెషల్. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నా' అని చెప్పారు. 'ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రేమకథ అవుతుంది' అని హీరో అరుణ్ ఆదిత్ తెలిపారు.