Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన నయనతార బాలీవుడ్ ఎంట్రీకి రంగం మొత్తం సిద్ధమైంది. షారూఖ్‌ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో నయనతార నటిస్తోంది. ఈ చిత్రంలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పక్కా కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో షారూఖ్, నయనతార ఎటువంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. షారూఖ్ ప్రస్తుతం 'పఠాన్' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు. రజనీకాంత్ సరసన 'అన్నాత్తే' చిత్రంలో, విజరుసేతుపతి, సమంత ప్రధాన తారాగణంగా 'కాతు వాకుల రెండు కాదల్' చిత్రంలోనూ నయనతార నటిస్తోంది.