Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో సూర్య పుట్టినరోజు నేడు (శుక్రవారం). ఈ సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్న 'ఎత్తారెక్కుమ్ తునిందవన్' చిత్ర ఫస్ట్‌లుక్‌ని గురువారం రిలీజ్ చేసి అభిమానులకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు. ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో తుపాకీతో ఓ షెడ్డులో విలన్లను వేటాడి చంపేస్తున్న సూర్య లుక్ అందరిన్నీ అలరిస్తోంది. ఇక ఈ ఫస్ట్‌లుక్ విడుదలైన నిమిషాల్లోనే లక్షల మంది చూడ్డం విశేషం. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా ఊరమాస్‌గా ఉండబోతోందని ఫస్ట్‌లుక్ క్లియర్‌గా చెప్పేసింది. ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, శరణ్య, సిబి, జయప్రకాశ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.