Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజరు ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నల్లమల'. రవి చరణ్ దర్శకుడు. ఆర్.ఎమ్ నిర్మాత. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ, 'నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేపథ్యంలో ఆసక్తికర కథాకథనాలతో తెరకెక్కిన చిత్రమిది. సాంకేతికంగానూ ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. సిద్ శ్రీరామ్ పాడిన 'ఏమున్నవే పిల్లా...' సాంగ్ ఇప్పటికే 17 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ పాటకు లక్షకు పైగా కవర్‌సాంగ్స్ రావడం విశేషం. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలు 1 మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించడం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్రేజ్‌ని తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్, ఎడిటర్: శివ సర్వాణి, ఆర్ట్: యాదగిరి, ఫైట్స్: నబా.