Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌతమ్ కష్ణ, పూజిత పొన్నాడ జంటగా గౌతమ్ కష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం 'ఆకాశ వీధుల్లో'. జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై మనోజ్ డి జె, డా.మణికంఠ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని ట్రైలర్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ఓ రోజు చిత్ర బృందం నాకు ఫోన్ చేసి ట్రైలర్ చూడమని, నచ్చితేనే సపోర్ట్ చేయండి అన్నారు. ట్రైలర్ చూశాకా చాలా ఇంటెన్సీవ్‌గా అనిపించింది. కొత్త దర్శకుడైనా మొదటి సినిమాకే ఇంత బాగా తీసాడంటే, అతనిలో ఎంత తపన ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా గౌతమ్ గురించి చెప్పారు. దర్శకుడిగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతోపాటు హీరోగా కూడా చాలా ఇంటెన్స్‌తో నటించాడు. పూజిత కూడా బాగా నటించింది' అని చెప్పారు. నిర్మాత మనోజ్ మాట్లాడుతూ,'ఈ సినిమా చేస్తానని మా అబ్బాయి అన్నప్పుడు, ఆ ఏదో చేస్తాడులే అని అందరిలా నేను అనుకున్నాను. కానీ ఈ సినిమా చిత్రీకరణ టైమ్‌లో మా అబ్బాయితో పాటు ఈ టీం పడుతున్న కష్టం చూసి, వీళ్ళు ఓ మంచి సినిమా చేస్తున్నారనే నమ్మకం కలిగింది. ఓ గొప్ప చిత్రాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాలుగు సాంగ్స్ ఉన్నాయి. వాటిల్లో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ థియేటర్స్‌లో దద్దరిల్లి పోతుంది. అలాగే రాహుల్ రామకష్ణ, చిన్మయి లాంటి వాళ్ళు పాడిన పాటలు కూడా చాలా బాగున్నాయి. మా సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు. 'దర్శకుడిగా నేనేమిటో నిరూపించుకోవాలనే ప్రయత్నమే ఇది. అలాగే ఈ సినిమా కథని ప్రజెంట్ చేయడంలో నేనే న్యాయం చేయగలనిపించింది. అందుకే హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించాను. ఇందులో హీరోని మర్డర్ చేసిన వ్యక్తిగానో, గ్యాంగ్‌స్టర్ గానో చూపించలేదు. ఓ హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి గురించి చెప్పే కథ ఇది. సినిమా ఫలితంపై చాలా నమ్మకంతో ఉన్నాం' అని హీరో, దర్శకుడు గౌతమ్ కష్ణ చెప్పారు.