Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలీ, నరేష్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'. ఆలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఏ.ఆర్.రెహ్మాన్ శిష్యుడు రాకేశ్ పళిదం ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలోని పతాక సన్నివేశంలో 'కలిశాయి కళ్లు కళ్ళు.. కురిసెను పూలజల్లూ..' అంటూ సాగే మూడో పాటను అగ్ర నాయిక సమంత విడుదల చేసి, ఆలీతోపాటు సినిమా టీమ్‌కి అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, 'ఈ సినిమాలోని మూడో పాటను నేను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే, నా ఫేవరేట్ ఆలీగారు ప్రొడక్షన్ చేస్తున్న మొదటి చిత్రమిది. నాకు ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీలంటే చాలా ఇష్టం. ఇలాంటి సోల్ ఉన్న కథలను నేను బాగా చూస్తుంటాను. ఈ సినిమా కూడా అలాందిదే. చాలా రియల్‌గా ఇప్పటి సమాజానికి తగ్గట్టుగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఆలీగారి మీద నమ్మకం ఉంది'' అని అన్నారు.
'సేను అడగ్గానే నా సినిమాలోని మూడో పాటను సమంత విడుదల చేసినందుకు హ్యాపీగా ఉంది. అలాగే తను చేస్తున్న 'శాకుంతలం' చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'వికతి' చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు మార్కెట్లోకి విడుదలై, చక్కని విజయం దక్కించుకున్నాయి. మొదటి పాటను ప్రభాస్ విడుదల చేసి సినిమా పబ్లిసిటీని ప్రారంభిస్తే, రెండో పాటను సోనూసూద్ విడుదల చేసి, సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చారు. ఇక మూడో పాటను సమంత రిలీజ్ చేసి మా సినిమా స్థాయిని మరింత పెంచారు. సమంత రిలీజ్ చేసిన 'కలిశాయి కళ్లు కళ్ళు.. కురిసెను పూలజల్లూ..' ఈ పాటకు స్వర్ణ మాస్టర్ చాలా బాగా నృత్య రీతుల్ని సమకూర్చారు.' అని అలీ చెప్పారు.