Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సంధర్బంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జెడ్పి చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జెడ్పి కార్యాలయ ఆవరణలో సీఈఓ ఐ.గోవింద్, జిల్లా పరిషత్ జిల్లా పంచాయతీ కార్యాలయాల సిబ్బందితో కలిసి దాదాపుగా 400 మొక్కలను నాటారు. స్నేహ సొసైటీ ప్రాంగణంలో మొక్కను నాటి అనంతరం కేటీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా వికలాంగ విద్యార్థులకు శాలువాలు, పండ్లను పంపిణీ చేశారు. వి.వి. నగర్ కాలనీలో గల పార్కులో మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన సందర్బంగా పూజలు చేసి అనంతరం శివ సాయిబాబా మందిర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొని కార్యవర్గానికి ప్రమాణస్వీకారం చేయించారు. ది. కార్యవర్గంలో మందిర అధ్యక్షులుగా విశ్వజిత్ రెడ్డి, కార్యదర్శిగా రచ్చ సుదర్శన్, కోశాధికారిగా శ్యాంసుందర్, కార్యవర్గ సభ్యులుగా ఆనంద్ రావు, సీతయ్య, సి.రఘువీర్ రెడ్డి, ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాల్లో వారితో పాటు కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణారావు, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ శంకర్, మాణికేశ్వర్ రావు, అంజయ్య, నీలంరెడ్డి, మనోహర్ రావు, నాగారావు, శేఖర్ రాజ్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.