Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన 'క్రష్' చిత్రంతో యువ హీరో అభరు సింహా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఓటీటీలో రిలీజై రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకాదరణ పొందిన 'క్రష్' సినిమా తర్వాత అభరు సింహా నటిస్తున్న చిత్రం 'కమిట్మెంట్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.
ఈ నేపథ్యంలో హీరో అభరు సింహా శనివారం మీడియాతో మాట్లాడుతూ, ''నెల్లూరి పెద్దారెడ్డి' వంటి కొన్ని చిత్రాల్లో మా నాన్న సతీష్ గారు హీరోగా నటించారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా హీరో కావాలను కున్నాను. డాన్స్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడు రవిబాబు 'క్రష్' సినిమా ఆడిషన్లో సెలెక్ట్ కావడంతో ఆ మూవీలో హీరోగా నటించే అవకాశం దక్కింది. మొదటి సినిమానే రవిబాబు లాంటి క్రియేటర్ దర్శకత్వంలో నటించడం అదష్టంగా భావిస్తున్నాను. 'క్రష్' ఓటీటీలో రిలీజ్ అయ్యాక నాకు మంచి పేరొచ్చింది. రొమాంటిక్ మూవీ కాబట్టి యూత్ ఆడియన్స్ ఎక్కువగా చూశారు. 'క్రష్' తర్వాత నేను నటించిన చిత్రం 'కమిట్మెంట్'. ఇది పలు కథల సమాహారం. ఒకరకంగా చెప్పాలంటే ఆంథాలజీ మూవీ. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కు యాక్షన్, ఎమోషన్ వంటి అన్ని షేడ్స్ ఉంటాయి. నాకు ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం. ఆయనలా మాస్, యాక్షన్ హీరోలా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతం మూడు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాను. వాటిలో 'సలీం అక్బర్ అనార్కలి' అనే సినిమా ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. మిగిలిన రెండు చిత్రాలను కూడా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొస్తాం' అని చెప్పారు.