Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్టాలు ఎన్ని ఉన్నా, ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'జైల్' (లాకప్).
వెంకటేష్ మమ్ముల, సజన్, అనన్య, హైమావతి, దేవ యశ్వంత్, వాసుదేవ్, లక్ష్మీరావు, కె.ఎస్.దేవి, రంజిత్, కీర్తన, శంభుప్రసాద్ ప్రధాన పాత్రధారులు. మాదాని కవితారాణి సమర్పణలో దండు శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.ఎస్.గౌడ్ దర్శకుడు.
'అందరినీ ఆలోచింపజేసే చిత్రమిది. ఇప్పటికే ప్రధాన భాగం చిత్రీకరణని పూర్తి చేశాం. తాజా షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది' అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఎస్ఎంవీ ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కథ: డి.శివకుమార్, మాటలు: పోలూర్ ఘటికాచలం, సంగీతం : సాయినాథ్, ఛాయాగ్రహణం: సురేంద్ర, పాటలు:పి.నాగేంద్రప్రసాద్, నిర్మాత: దండు శివకుమార్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: జి.ఎస్. గౌడ్.