Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న పూజా హెగ్డే లేటెస్ట్గా మరో భారీ బంపర్ ఆఫర్‌ని దక్కించుకుందని సమాచారం. తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన పూజా మెరవనుందట. ధనుష్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. ప్రస్తుత సమాజంలో ఉన్న విద్యావ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కి జోడీగా పూజాని చిత్ర బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ 'రాధేశ్యామ్', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', రామ్‌చరణ్ 'ఆచార్య' చిత్రాల్లో పూజా నటించింది. ఈ మూడు చిత్రాలూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలోనూ పూజానే కథానాయిక. ఇక లేటెస్ట్గా తమిళంలో విజరు సరసన 'బీస్ట్' చిత్రంలోనూ నటించడానికి గ్రీన్‌సిగల్ ఇచ్చింది. వీటితోపాటు బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్ 'భాయిజాన్', 'సర్కస్' చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.