Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూపేష్ కుమార్ చౌదరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం '22'. శివకుమార్ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి సుశీలా దేవి ఈ చిత్రాన్ని నిర్మించారు. సలోని మిశ్రా హీరోయిన్గా నటిస్తోంది. సోమవారం హీరో రూపేష్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'దర్శకుడు శివ ఈ కథ చెబుతున్నప్పుడే ఎగ్జైట్‌గా ఫీలై, ఈ సినిమా చేశాం. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. '22' నెంబర్ అనేది ఈ సినిమాలో మేజర్ పాయింట్. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ 'రుద్ర' పాత్రలో నటించాను. 'ఖైదీ నెంబర్ 150', 'బాహుబలి', 'సాహౌ' వంటి చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన జాషువా మాస్టర్ మా సినిమాలో అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌ని కంపోజ్ చేశారు. మా డైరెక్టర్ శివకి ఇది మొదటి సినిమా అయినా ఫుల్ క్లారిటీతో సినిమా తీశారు. మేకింగ్, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లావీష్‌గా తీశాం. సలోని మిశ్రా మంచి ఇంపార్టెన్స్ ఉన్న సీబిఐ ఆఫీసర్ పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు విక్రమ్‌జిత్ విర్క్ ఈ సినిమాలో నెగటివ్ రోల్లో కనిపించనున్నారు. మా చిత్రాన్ని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.