Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ కార్తీక్, హేబా పటేల్ జంటగా రూపొందుతున్న చిత్రం 'తెలిసినవాళ్లు'. కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు జరిపిన చిత్రీకరణతో 90 శాతం సినిమా పూర్తయ్యింది. త్వరలోనే ప్రోస్ట్ ప్రొడక్షన్స్ పనులకు వెళ్ళబోతున్న సందర్భంగా హీరో రామ్ కార్తీక్ లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'ఇటీవల విడుదల చేసిన హేబాపటేల్ ఫస్ట్‌లుక్‌కి ఎంతటి ఆదరణ లభించిందో, అలాగే హీరో రామ్ కార్తీక్ లుక్‌కి కూడా అంతే మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హీరో లుక్‌కి మంచి స్పందన రావటంతో ఇప్పట్నుంచి వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేయబోతున్నాం. అలాగే 'తెలిసినవాళ్ళు' అనే టైటిల్ పెట్టడంతో అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ 'తెలిసినవాళ్ళు' ఏం చేశారనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే బాగుంటుంది.హీరో, హీరోయిన్లు రామ్ కార్తీక్, హేబాపటేల్ ఇద్దరూ చాలా బాగా నటించారు. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్‌తో పాటు మిగిలిన సీనియర్ నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ఫిలిం స్కూల్లో గ్రాడ్యుయేట్‌ని పూర్తి చేసుకొని వాళ్ళు మా సినిమాకి సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న మా సినిమా ఒక పాట మినహా 90 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగిలిన పది శాతం చివరి షెడ్యూల్లో పూర్తి చేస్తాం' అని తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అజరు వి నాగ్, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, సంగీతం: దీపక్ వేణుగోపాలన్, సాహిత్యం: డాక్టర్ జివాగో, కళ: ఉపేందర్ రెడ్డి, కొరియోగ్రఫీ: జావేద్ మాస్టర్, శైలజ మాస్టర్, ఫైట్స్: సి.హెచ్ రామకష్ణ, లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి.