Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు వచ్చి మా 'నరసింహపురం' చిత్రాన్ని ఆశీర్వదించిన ప్రేక్షక దేవుళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రేక్షకులు అందించిన ఈ అపూర్వ విజయం మాకెంతో ప్రత్యేకం' అని అంటున్నారు చిత్ర దర్శక, నిర్మాతలు. ఇటీవల విడుదలైన 'నరసింహపురం' చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బందం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసి, కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకుంది. ఈ వేడుకలో హీరో నందకిషోర్, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, ఛాయాగ్రాహకుడు కర్ణ ప్యారసాని, గీత రచయిత గెడ్డం వీరు, చెల్లెలు పాత్రధారి ఉష తదితరులు పాల్గొన్నారు. నిర్మాత, ఊర్వశి ఓటిటి సిఇవో టి. రామసత్యనారాయణ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో నందకిషోర్ మాట్లాడుతూ,'మా చిత్రాన్ని గుండెలకు హత్తుకుంటున్న ప్రేక్షకులకు కతజ్ఞతలు. ఈ విజయం కేవలం నాకు మాత్రమే కాదు, ఈ చిత్రంలో నటించిన, ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకం' అని తెలిపారు. 'రెండేళ్ల మా కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది' అని దర్శక, నిర్మాతలు శ్రీరాజ్ బళ్లా, ఫణిరాజ్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాతగా తనకు మూడు కమర్షియల్ సక్సెస్‌లు ఇచ్చిన శ్రీరాజ్ ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టడం గర్వంగా ఉందని టి. రామసత్యనారాయణ చెప్పారు.