Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇక అల్లుఅర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ ముగ్గురు కలిస్తే సరికొత్త మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తారనే నమ్మకం అందరిలోనూ ఉంది. వీళ్ళ అభిమానుల గురించి వేరే చెప్పకర్లేదు. పూనకం వచ్చినట్టు ఊగిపోతారు.
'ఆర్య', 'ఆర్య 2' తర్వాత ఈ ముగ్గురు కలిసి 'పుష్ప' చిత్రానికి పని చేస్తుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఈ సినిమా ఉంటుందనే ధీమాతో చిత్ర బృందం కూడా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, అల్లుఅర్జున్ ఇంట్రో టీజర్‌కి అనూహ్య స్పందన లభించింది.
సోమవారం దేవిశ్రీ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప' ఆడియోపై చిత్రబందం ఓ స్పెషల్ అప్డేట్ ఇచ్చింది. ఈనెల 13న 'పుష్ప' ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. 'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీ సారథ్యంలో ఐదు భాషల్లో విశాల్ దడ్లానీ (హిందీ), విజరు ప్రకాశ్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాల్ (తమిళం) వంటి ఐదుగురు ప్రముఖ గాయకులు ఆలపించనున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మైౖత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.