Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు శశి శైలి చాలా ప్రత్యేకం. 'శీను', 'రోజాపూలు', 'బిచ్చగాడు' వంటి తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ చేయటంలో ఆయన బాగా సక్సెస్ అయ్యారు. ఇక లేటెస్ట్గా అనుబంధాల నేపథ్యంలో 'ఒరేరు బామ్మర్ది' చిత్రాన్ని తెరకెక్కించారు. సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా ఈనెల 13న థియేటర్లలో విడుదల కాబోతోంది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం దర్శకుడు శశి మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే, 'హ్యూమన్ ఎమోషన్స్ లేకుండా నేను ఏ సినిమా చేయను. 'బిచ్చగాడు' సినిమాలో తల్లీకొడుకుల మధ్య ప్రేమని చూపించాను. ఈ సినిమా బావ, బావమరిది మధ్య ఉండే అనుబంధాలను చూపిస్తున్నాను. బావ, బావమరిది మధ్య ఉండే అనుబంధం చాలా ప్రత్యేకమైనది. 'సివప్పు మంజల్ పచ్చై' అనే పేరుతో తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దీంతో 'ఒరేరు బామ్మర్ది'గా అనువాదం చేసి తెలుగులో విడుదల చేస్తున్నాం. ఈ కథ సిద్ధార్థ్‌కు నెరేట్ చేసి, బావమరిది క్యారెక్టర్ చేయమని అడిగాను. కానీ సిద్ధార్థ్‌కు బావ క్యారెక్టర్ నచ్చి, ఆ పాత్రలో నటించారు. బావమరిది క్యారెక్టర్లో జీవీ ప్రకాష్ కుమార్‌ని తప్ప మరొకరు సెట్ అవ్వరనిపించింది. సిద్ధార్థ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. జీవీ కూడా అద్భుతంగా నటించారు. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా బాగా కుదిరాయి. ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది' అని శశి తెలిపారు.