Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యష్ కథానాయకుడిగా కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రం 'లక్కీ'. ఈ చిత్రాన్ని తెలుగులో 'లక్కీ స్టార్'గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన నటి రాధికా కుమారస్వామి స్వయంగా ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ సరసన రమ్య నాయికగా నటించింది. లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ,'కన్నడలో యష్‌కు స్టార్ డమ్ తెచ్చిన చిత్రాల్లో 'లక్కీ' ఒకటి. యష్ నటన, రమ్య గ్లామర్, 'రాబర్ట్' ఫేమ్ అర్జున్ జన్య మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. సీనియర్ రైటర్ గురుచరణ్ తెలుగులో మాటలతోపాటు పాటలు కూడా రాశారు. 'కె.జి.ఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై తెలుగునాట మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కన్నడలో మాదిరిగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అనువాద కార్యక్రమాలు దాదాపు పూర్తి కావచ్చాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు.