Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్థి జంటగా నటించిన చిత్రం 'మెరిసే మెరిసే'. కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా ఈనెల6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. దర్శకులు వి.వి. వినాయక్, సుకుమార్ వీడియో సందేశం ద్వారా చిత్ర బందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ, 'ఇదొక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతాతోపాటు మిగతా ఆర్టిస్ట్‌లు చాలా చక్కగా నటించారు. ఈనెల 6న పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా సినిమాను థియేటర్లలో చూసి, మేం మరిన్ని చిత్రాలను నిర్మించేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
దర్శకుడు పవన్‌కుమార్.కె మాట్లాడుతూ, 'యువత ఆలోచనలు, ఆశలు, కోరికల నేపథ్యంలో తీసిన చిత్రమిది. నేటి తరం యువతీ యువకుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది. ఏం చేయాలనే విషయంలో స్పష్టత ఉండదు. అలాంటి అయోమయంలో ఉన్న అమ్మాయి వెన్నెల, అబ్బాయి సిద్ధు ఎలా తారసపడ్డారు?, ఎలా స్ట్రగుల్ అయ్యారు?, ఎలా సక్సెస్ అందుకున్నారు అనేదే ఈ సినిమా. వీళ్లిద్దరివీ సెన్సిబుల్ క్యారెక్టర్స్. అలాగే వీళ్ళ క్యారెక్టర్స్ పోటా పోటీగా ఉంటాయి. మేకింగ్ పరంగా సినిమా మంచి క్వాలిటీతో రావడానికి కారణం మా నిర్మాత వెంకటేష్‌గారి రాజీపడని తనం' అని తెలిపారు. 'నేను సినిమా చూసినప్పుడు మ్యూజిక్ అమేజింగ్‌గా అనిపించింది. మా చిత్రాన్ని థియేటర్లలో చూసి మీరూ ఎంజారు చేయండి' అని నాయిక శ్వేతా అవస్థి చెప్పారు. హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ, 'ఇది నా మూడో సినిమా. మా సినిమాను ఓటీటీకి ఎందుకు ఇవ్వలేదు అని చాలా మంది అడిగారు. మాకు థియేటర్లంటే ప్రాణం. థియేటర్లతో మా లైఫ్‌లో ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి. ఒక చిన్న సినిమా ఆదరణ పొందితే ఎంతోమంది కలలు నిజం అవుతాయి. ఇదొక ఒక క్లీన్ మూవీ. ప్లెజంట్‌గా ఉంటుంది' అని చెప్పారు.