Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పుష్ప' చిత్రానికి సంబంధించి రోజుకొక అప్డేట్ ఇస్తూ అల్లుఅర్జున్ అభిమానులతోపాటు ట్రేడ్ వర్గాల్ని సైతం చిత్ర బృందం సర్ప్రైజ్ చేస్తోంది.'దాక్కో దాక్కో మేక'.. అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ని ఈనెల 13న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు సోమవారం చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ పాట తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదలవుతోంది. ఈ పాట కోసం ఎదురు చూస్తున్న ఆసక్తి నుంచి తేరుకోకముందే చిత్ర బృందం మంగళవారం సరికొత్త అప్డేట్ ఇచ్చి అందర్నీ షాకయ్యేలా చేసింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ 1 'పుష్ప' - ద రైజ్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. 'పుష్ప పార్ట్ 1' ఈ డిసెంబరులో.. తగ్గేదే లే' అని ఆ పోస్టర్‌పై ఉండటంతో అల్లుఅర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
'అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో పదేళ్ళ తర్వాత వస్తున్న చిత్రమిది. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి. తెలుగు ఇండిస్టీలో మరే హీరోకి సాధ్యం కాని స్థాయిలో అల్లు అర్జున్ 'పుష్ప-ద రైజ్' టీజర్‌తో సరికొత్త చరిత్ర సష్టించారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ 1 'పుష్ప- ద రైజ్'ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఈనెల 13న ఐదు భాషల్లో ఫస్ట్ సిింగిల్ విడుదల కానుంది. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ గాయకులు ఈ పాటను ఆలపించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది' అని చిత్ర బృందం తెలిపింది.
ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.