Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'ఎస్.ఆర్.కళ్యాణమండపం ఇస్టీడీ 1975'. నూతన దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో ప్రమోద్, రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్‌ను శంకర్ పిక్చర్స్ వారు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఈనెల 6న ప్రపంచ వ్యాప్తంగా 600 థియేటర్స్‌లో ఈ చిత్రం విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ట్రైడెంట్ హౌటల్లో సినీ అతిరథుల సమక్షంలో చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన దర్శకుడు యస్.వి.కష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి చిత్ర బందానికి బెస్ట్ విషెస్ తెలుపగా, రాజశేఖర్, జీవిత ఈ చిత్ర బిగ్ టికెట్‌ని రిలీజ్ చేశారు. హీరోలు అల్లరి నరేష్, కార్తికేయ మొదటి టికెట్‌ను కొనుగోలు చేశారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ, 'హీరో కిరణ్ అబ్బవరం నన్ను కలిసి కథ చెప్పినప్పుడు, ఇందులో నన్ను కొత్తగా చూపించబోతున్నాడని పించింది. అదేంటి అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. చాలా మంచి సినిమా' అని చెప్పారు.
'మా మీద, నా కథ మీద నమ్మకంతో నిర్మాతలు ప్రమోద్- రాజు నాకు ఈ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు. ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే కథతో ఎంతో ఆసక్తిగా రూపొందిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. సాయికుమార్ హీరో తండ్రి పాత్ర పోషించారు. ఇందులో తండ్రీకొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించే ప్రయత్నం చేశాం' అని దర్శకుడు శ్రీధర్ గాదె చెప్పారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,' సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాని చూసిన వారంతా చాలా బాగా ఎంజారు చేస్తారు. ఈ సినిమాలోని ఎమోషన్స్ మీకు ఎప్పటికీ గుర్తు ఉంటాయి' అని తెలిపారు.
నిర్మాతలు ప్రమోద్, రాజు మాట్లాడుతూ,'ఈ పాండమిక్ పరిస్థితుల్లో ప్రేక్షకులు హాయిగా నవ్వుకుని, మంచి సినిమా చూశామని హ్యాపీ ఫీల్‌తో బయటకు రావాలని ఉద్దేశంతో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. చదువుకునే వయసులో చదువుకోక పోతే ఎం జరుగుతుందనేది ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. ప్రతి కొడుకు తన తండ్రిని, ప్రతి తండ్రి తన కొడుకును గుర్తు చేసుకుంటాడు. ఇదొక చక్కటి కుటుంబ కథా చిత్రం. కెనడా, ఆస్ట్రేలియాతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 600 థియేటర్స్‌లో మా చిత్రాన్ని ఈనెల 6న రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు.