Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇందువదన'. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.ఆర్. దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రమిది. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్ చేసి, టీజర్ చాలా బాగుందని చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్‌లాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, 'ఈ సినిమా బాగా వచ్చింది. ఫస్ట్‌లుక్, హీరో, హీరోయిన్ల క్యారెక్టర్స్ ఇంట్రో లుక్స్ కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన లభించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ యుట్యూబ్లో మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా చార్ట్‌బస్టర్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇక లేటెస్ట్గా విడుదలైన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతుండటం విశేషం' అని తెలిపారు.
దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ,'చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం' అని చెప్పారు. 'ఈ చిత్రంలో ఓ మంచి పాత్రని పోషించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. నా పాత్రకు మంచి పేరొస్తుందని, అలాగే ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను' అని కథానాయిక ఫర్నాజ్ శెట్టి అన్నారు.