Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'డిఎస్‌జె' (దెయ్యంతో సహజీవనం). కీలక పాత్రలో రాజీవ్ సాలూరు నటించిన ఈ చిత్రానికి నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి లక్ష్మి, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్ర టీజర్లను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, 'ఒక యదార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఓ ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే దాన్ని చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో, అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని మలిచాం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి సెకెండ్ హీరోయిన్గా ఓ పవర్ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో నటించింది' అని చెప్పారు. హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ, ' మా నాన్న డైరెక్షన్లో హీరోయిన్గా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అని తెలిపారు. 'నేటి ట్రెండ్‌కు తగ్గట్టు విభిన్నంగా నిర్మించిన హర్రర్ చిత్రమిది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.