Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్ర ప్రొడక్షన్స్... తొలి ప్రయత్నంగా చేస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని బుధవారం ఎనౌన్స్ చేశారు. న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు.
'శ్రీనివాస్ రాజు అందరికీ నచ్చేలా వైవిధ్యమైన కథాంశంతో స్క్రిప్ట్‌ని రెడీ చేశారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎడిటర్: గ్యారీ బి.హెచ్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్స్: వెంకట్, సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్ (100% లవ్), దర్శకత్వం: శ్రీనివాస్ రాజు.