Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మ్యాడ్'. మోదెల టాకీస్ పతాకంపై టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కష్ణారెడ్డి, ఆయన మిత్రులు నిర్మాతలుగా లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా ఈనెల 6న విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ప్రసాద్‌ల్యాబ్స్‌లో బుధవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏలూరు శ్రీను మాట్లాడుతూ, 'న్యూ ఏజ్ కపుల్స్ స్టోరీ ఇది. వాళ్ల మ్యారేజ్ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేశారని చూపించాం' అని చెప్పారు. 'ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది. రెగ్యులర్ చిత్రంలా ఉండదు' అని దర్శకుడు లక్ష్మణ్ మేనేని అన్నారు. నిర్మాత కష్ణారెడ్డి మాట్లాడుతూ, 'మా చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి రియల్ ఫిల్లర్. మా పదేళ్ల కల ఈ సినిమా' అని అన్నారు.
ఓ మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో మంచి పాత్రలు పోషించినందుకు చాలా సంతోషంగా ఉందని హీరో, హీరోయిన్లు మాధవ్ చిలుకూరి, రజత్ రాఘవ్, శ్వేత వర్మ, స్పందన పల్లి అన్నారు.