Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిరిపోయే డాన్స్‌తో, కామెడీ టచ్ ఉన్న మేనరిజమ్స్‌తో ఎప్పుడూ ప్రేక్షకుల్ని అలరించే ప్రభుదేవా ఈసారి పంథా మార్చారని 'పొక్కల్ కుతురై' సినిమా పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. తల నుంచి రక్తం కారుతున్నప్పటికీ ఓ చేత్తో పాపని ఎత్తుకుని, మరో చేత్తో ఆయుధం పట్టుకుని బెదిరింపు ధోరణితో ప్రభుదేవా చూస్తున్న లుక్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది. అన్నింటిమించి కృత్రిమ కాలుతో దేనికైనా సై.. అన్నట్టు ఉన్న ప్రభుదేవా తీరు చాలా ఇంటెన్స్‌గా ఉంది. ప్రభుదేవా తొలిసారి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్ర చేస్తుండటం విశేషం. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రభుదేవా తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవా సరసన వరలక్ష్మీ శరత్‌కుమార్, రైజా విల్సన్ నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, జాన్ కొక్కెన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డార్క్ రూమ్ పిక్చర్స్‌తో కలిసి మిని స్టూడియో పతాకంపై వినోద్‌కుమార్ నిర్మిస్తున్నారు. 'తొలిసారి నా పంథాకి భిన్నంగా ఓ పాత్రలో నటించాను. ఆ పాత్ర ఎలా ఉంటుందో పోస్టర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి అరుదైన పాత్రని పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది.' అని ప్రభుదేవా చెప్పారు.