Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రావే నా చెలియా'. సూర్య చంద్ర ప్రొడక్షన్ పతాకంపై నెమలి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్వర్ రెడ్డి దర్శకుడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ బుధవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. నటుడు చంద్రకాంత్ ట్రైలర్‌ని విడుదల చేయగా, తొలి పాటను మరో నటుడు కష్ణతేజ్, మరో పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ పాల్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 'ఈనెల 6న సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్‌లో ట్రైలర్‌ని విడుదల చేస్తున్నాం. అలానే ఈనెల 13న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రానికి టీమ్ అందించిన సపోర్ట్ మరిచిపోలేను. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు. కొరియోగ్రాఫర్ పాల్ మాట్లాడుతూ,'హీరో,హీరోయిన్స్ చాలా బాగా సపోర్ట్ చేసి డాన్స్ బాగా చేశారు. మా అబ్బాయి హీరోగా సంవత్సరానికి మూడు సినిమాలు చేయాలని ఆశించిన నిర్మాత నెమలి సురేష్‌గారు సినిమా విడుదలవుతున్న సమయంలో మన మధ్య లేకపోవడం బాధిస్తోంది. ఎన్ని కష్టాలు ఉన్నా సినిమాని విడుదల వరకు తీసుకొచ్చిన హీరో నెమలి అనిల్, డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డిని అభినందించాలి. సినిమా చాలా బాగా వచ్చింది' అని తెలిపారు.