Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''విరాగో' అంటే సంస్కతంలో మహిళా యోధురాలు అని అర్థం. అరకు ప్రాంతానికి చెందిన ఓ యువతి, తన అక్కకి జరిగిన అన్యాయంపై చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన చిత్రం 'అరకులో విరాగో'' అని దర్శక, నిర్మాతలు చెప్పారు. తోట ప్రొడక్షన్స్ పతాకంపై గిరి చిన్నా దర్శకత్వంలో శ్రీమతి తోట సువర్ణ తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవీన్ ప్రగడ, పూజా చౌరాసియా హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, డి.ఎస్.రావు ప్రతినాయకుడిగా మెరవబోతున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీమతి తోట సువర్ణ మాట్లాడుతూ, 'దర్శకుడు గిరి చెప్పిన కథ ఎంతగానో నచ్చి, అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నేను కూడా నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నాను. తన అక్కకి జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీసుల్ని ఆశ్రయిస్తే, అక్కడ కూడా ఎదురైన ఆరాచకంపై ఓ ధీర వనిత తీర్చుకునే ప్రతీకారమే మా చిత్రం. హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న రవీన్ ప్రగడ, పూజా చౌరాసియా అద్భుతంగా నటించారు. విలన్గా డిి.ఎస్.రావు తన నట విశ్వరూపం చూపించారు. మా చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.