Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమెడియన్ సత్య హీరోగా నటించిన చిత్రం 'వివాహ భోజనంబు'. ఈ చిత్రాన్ని హీరో సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం విశేషం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. అర్జావీ రాజ్ నాయికగా ఈ సినిమాతో పరిచయం అవుతోంది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ సోని లివ్ ఓటీటీ ద్వారా విడుదలైంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ఈ ట్రైలర్ అందర్నీ విశేషంగా అలరిస్తోంది.
'కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా చూపించనుందీ సినిమా. తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్డౌన్ ఎలాంటి తిప్పులు తీసుకొచ్చింది?, వచ్చిన బంధువులను వదిలించు కోవడానికి ఏం చేశాడనేది ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంచ్ అవుతున్న సోని లివ్ తన తొలిచిత్రంగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతోంది. స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.