Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రాందీ డైరీస్'. లేళ్ల శ్రీకాంత్ ఆయన మిత్ర బందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్బంగా మేకర్స్ మాట్లాడుతూ,'సెన్సార్‌ని పూర్తి చేసుకుని ఈ నెల 13న ప్రపంచంవ్యాప్తంగా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. శివుడు రచన, దర్శకత్వంలో పూర్తి ఇండిపెండెంట్ సినిమాగా రూపుదిద్దుకున్న చిత్రమిది. వ్యక్తిలోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణలతో, సహజమైన సంఘటనలు, సంబాషణలు, పరిణితి ఉన్న పాత్రలతో అత్యంత ఆసక్తికరంగా ఈ సినిమా ఉంటుంది. వాస్తవికత, వినోదాల మేళవింపుగా రూపొందిన ఈ సినిమా తెలుగులో రాబోతున్న అతి పెద్ద ఇండిపెండెంట్ సినిమా. జానపద గాయకుడు, రచయిత పెంచల దాస్ ఒక పాట ఇవ్వగా, సాయి చరణ్, హరిచరణ్, రవి కుమార్ మందా నేపథ్య గానం అందించారు. ట్రైలర్‌కి, సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చింది. పెంచల్ దాస్ రాసిన పాట లిరికల్ వీడియోని తనికెళ్ళ భరణి విడుదల చేయగా, పది లక్షలు వ్యూస్ సొంతం చేసుకుని చిన్న సినిమాల్లో రికార్డు నెలకొల్పింది' అని చెప్పారు.