Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను కథానాయకుడు నాని స్టార్ట్ చేసి సమర్పకుడిగా వ్యవహరిస్తూ, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 'ఆ', 'హిట్' వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక లేటెస్ట్గా దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం డిిఫరెంట్ కంటెంట్‌తో 'మీట్ క్యూట్' అనే అంథాలజీని రూపొందిస్తున్నారు. ఐదు కథల సంకలనంగా తెరకెక్కుతున్న ఈ యాంథాలజీలో సీనియర్ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. రోహిణి, ఆదాశర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునైన, సంచితా పూనాంచ, అశ్విన్‌కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ... ఇలా వేర్వేరు భాషలకు చెందిన ఆరుగురు మేల్ లీడ్స్, ఆరుగురు ఫిమేల్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. జూన్‌లో లాంఛనంగా ప్రారంభమైన ఈ యాంథాలజీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది' అని మేకర్స్ తెలిపారు. ఈ యాంథాలజీకి సినిమాటోగ్రఫీ: వసంత్ కుమార్, మ్యూజిక్: విజరు బుల్గానిన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాశ్, ఎడిటర్: గ్యారీ బి.హెచ్, లిరిక్స్: కెకె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), రచన - దర్శకత్వం: దీప్తి గంటా.