Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన కొత్త సినిమా 'జై భీమ్' ని అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ చేస్తున్నట్టు హీరో సూర్య గురువారం ప్రకటించారు. తమిళ, తెలుగు భాషల్లో నవంబరు నుంచి స్ట్రీమింగ్ కానుంది. తేదీని ఇంకా ఖరారు చేయలేదు. టి.ఎస్.జ్ఞానవేల్ దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. గిరిజనుల తరఫున పోరాడే న్యాయవాదిగా సూర్య నటించారు. ఆయన సరసన రజిషా విజయన్ మెరవనుంది. 'ఆకాశం నీ హద్దురా' వంటి హిట్ సినిమా తర్వాత సూర్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతోపాటు తాజా చిత్రాన్ని సైతం సూర్య డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంపై ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నీ స్థాయిని దిగజార్చుకోకు సూర్య'.. అంటూ నెటిజన్లు సైతం థియేటర్ వ్యవస్థకు మద్దతు ఇస్తూ సూర్యపై కామెంట్ల వర్షం కురిపించారు.