Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఈ చిత్రంలో రాణి నందిని, ఆమె తల్లి మందాకినీ దేవిగా బాలీవుడ్ కథానాయిక ఐశ్వర్యరారు ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్యరారు వెండితెరపై కనిపించడం, పైగా తల్లీకూతుళ్ళుగా నటించడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పాండిచ్చేరి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ షెడ్యూల్లో ఐశ్వర్యారారుపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణతోపాటు ఐశ్వర్యరారు, కార్తీ, త్రిష తదితరులపై ఓ ప్రత్యేక పాటను చిత్రీకరించబోతున్నారని వినిపిస్తోంది. అలాగే ఆదికరి కాలన్గా విక్రమ్, వందీయాతేవన్గా కార్తీ, కుందాదేవిగా త్రిష, సుందర ఛోహార్ పాత్రలో ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారట. 'పొన్నియన్ సెల్వన్' పేరుతో కల్కీ కృష్ణమూర్తి రాసిన చారిత్రక నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇందులో తొలి భాగం 'పీఎస్1'ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా సుభాస్కరన్ సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథనం: జైమోహన్, సంగీతం : ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్, కళా దర్శకత్వం: తోట తరణి, కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్.