Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాపర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పరిచయం అవుతూ నిర్మిస్తున్న చిత్రం 'నాట్యం'. ఈ సినిమాలో తొలి పాట 'నమః శివాయ' ను శుక్రవారం అగ్ర కథానాయకుడు బాలకష్ణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, 'సంధ్యారాజు, దర్శకుడు రేవంత్ కోరుకొండ, కమల్ కామరాజ్ తదితరులు ఈ సినిమా కోసం పడిన కష్టం అసాధారణం. ఇలాంటి ఓ వైవిధ్యమైన సినిమాని, పాటలను ఈ జనరేషన్‌కు అందించడం గొప్ప విషయం. ఈ సినిమాలో 'నమః శివాయ' పాటను విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపుర నియోజక వర్గంలోని లేపాక్షి ఆలయంలోనే ఈ పాటను చిత్రీకరించారు. విడుదల చేసిన పాట చాలా అద్భుతంగా ఉంది. అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్న ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయాన్ని సాధిస్తుంది' అని చెప్పారు.
''నమః శివాయ' పాటలో వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్స్ పాల్గొనగా లేపాక్షి ఆలయంలో ఈ పాటను ఆరు రోజుల పాటు చిత్రీకరించారు. 40 డిగ్రీల ఎండలో ఎంతో కష్టమైనా, కాళ్లు మండుతున్నా డాన్సర్స్ ఈ పాటను పూర్తి చేశారు. జగద్గురు ఆది శంకరాచార్య అర్థనారీశ్వర స్తోత్రాన్ని పాటగా మలిచారు. శ్రవణ్ భరద్వాజ్ ఈ పాటను క్లాసిక్, ఫ్లోక్ స్లైల్లో ఆధ్యాత్మికంగా మలిచారు. కాలా భైరవ, లలిత కావ్య ఈ పాటను అద్భుతంగా పాడారు.
లహరి యూట్యూబ్ ఛానెల్లో ఈ పాటను విడుదల చేశారు. అద్బుతమైన విజువల్స్‌తో అందమైన ఆర్కిటెక్చర్ ఉన్న హంపి, లేపాక్షి, బెంగుళూరు, హైదరాబాద్‌లలోని పలు ప్రముఖ ఆలయాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు' అని చిత్ర బృందం తెలిపింది.
సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, బేబీ దీవన తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్: మహేశ్ ఉప్పుటూరి, ప్రొడక్షన్ డిజైనర్: సంధ్యా రాజు, స్క్రిప్ట్, కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం: రేవంత్ కోరుకొండ.