Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈమధ్య కాలంలో తమిళ కథానాయకులు ట్రెండ్ మార్చారు. సహజత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కథల ఎంపిక, పాత్రల రూపురేఖల పై మరింత శ్రద్ధ పెడుతున్నారు. ఈ క్రమంలో డీగ్లామర్గానూ తెరపై కనిపించేందుకు వెనకాడ్డం లేదు. లేటెస్ట్గా 'పొరుక్కాల్ గుదిరై'లో ఒక కాలు లేని దివ్యాంగుడిగా ప్రభుదేవా నటిస్తుంటే, 'వెందు తనిందదు కాడు' చిత్రంలో ఎవ్వరూ గుర్తుపట్టలేనంత డీ గ్లామర్ రోల్లో శింబు నటిస్తున్నారు. ఎప్పుడూ రొమాంటిక్, స్టైలిష్ లుక్‌లో సిల్వర్‌స్క్రీన్ మీద మ్యాజిక్ చేసే శింబు తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించి అందర్నీ షాకయ్యేలా చేశారు. దర్శకుడు గౌతమ్ మీనన్ తెెరకెక్కిస్తున్న కొత్త చిత్రం 'వెందు తనిందదు కాడు' కోసం
శింబు తనని తాను మార్చుకున్న వైనానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని చిత్రబందం విడుదల చేసింది. లుంగీ కట్టుకుని, కర్రపట్టుకుని అమాయకంగా శింబు కనిపిస్తుంటే, ఆయన వెనక మంటలు చెలరేగుతున్నాయి. 'వెందు తనిందదు కాడు' అంటే కాలి బూడిదైన అడవి అని అర్థం. దీన్ని బట్టి అడవి నేపథ్యంలో సాగే కథ అని వేరే చెప్పక్కర్లేదు. గౌతమ్ మీనన్, శింబు కాంబినేషన్లో తెరకెక్కిన 'విన్నైతాండి వరువాయా' (ఏమాయ చేశావే) సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ తాజా చిత్రంపై అంచనాలు పెరిగాయి.