Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాక్షన్ సీక్వెన్స్‌లకు, అదిరిపోయే డాన్సులకు పక్కా కేరాఫ్‌గా నిలిచిన బాలీవుడ్ యువ కథానాయకుడు టైగర్ షరాఫ్.. ఇకపై గాయకుడిగానూ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఫైటర్‌గా, డాన్సర్‌గా తనకంటూ ఓ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన సింగర్‌గానూ అందరినీ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆయన పాడిన 'వందేమాతరం' మ్యూజిక్ వీడియోని రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాట గురించి టైగర్ షరాఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, 'జీవితంలో ఇలాంటి పాట పాడటం ఇదే తొలిసారి. చాలా సంతోషంగాను, అలాగే భయంగానూ ఉంది. 'వందేమాతరం' అనేది కేవలం పాట మాత్రమే కాదు. ఒక ఎమోషన్. ఇలాంటి అరుదైన పాటను పాడి దేశానికి అంకితమివ్వడం గౌరవంగా భావిస్తున్నా. ఈనెల ్ట10న ఈ మ్యూజిక్ వీడియోని రిలీజ్ చేయబోతున్నాం' అని చెప్పారు. 'వందేమాతరం' వీడియో సాంగ్‌కి రెమో డిసౌజా దర్శకత్వం వహించగా, కౌశల్ కిశోర్ సాహిత్యాన్ని, విశాల్ మిశ్రా సంగీతాన్ని సమకూర్చారు. ఇదిలా ఉంటే, టైగర్ షరాఫ్ ప్రస్తుతం 'హీరోపంటి2', 'భాఘీ 4', 'గణపత్', రాంబో నటించిన 'ఫస్ట్ బ్లడ్' రీమేక్‌లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.