Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'జీఎస్టీ'. (గాడ్, సైతాన్, టెక్నాలజీ).
ఈ సినిమా ఫస్ట్ కీని కాటికాపరి, లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ 2011 రికార్డ్స్ పురస్కార గ్రహీత డా.పట్ట పగలు వెంకట్రావు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'జీఎస్టీ' అనగానే ట్యాక్స్ పరంగా ఏదైనా కొత్త విషయాలు చెబుతారేమో, బహుశా అటువంటి సినిమా తీసారేమోననే ఆలోచన మనందరికీ వస్తుంది. కానీ, అది కానే కాదు. 'దేవుడు' కావాలా? దెయ్యం కావాలా? టెక్నాలజీ పరంగా మన జీవితాన్ని గడుపుదామా... అనే విషయాలపై తీసిన సందేశాత్మక చిత్రమిది' అని తెలిపారు.
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ,'దేవుడు, దెయ్యం, సైన్స్‌లో ఏది వాస్తవం అనేది మా సినిమా కంటెంట్. ఈ సమాజంలో దేవుడు, దెయ్యం ఉన్నాయని కొందరు, ఈ రెండు లేవు సైన్స్ మాత్రమే వాస్తవం అని మరికొందరు చెబుతూ, వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ వాదనలు చేసే వాళ్ళు సామాన్యులు మాత్రమే కాదు, ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్న మేధావులు కూడా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనుషుల్లో శాస్త్రీయ స్ఫూర్తి లోపించి, విజ్ఞానం వినాశనానికి దారి తీస్తుందా అనే విషయాలను ఇందులో చూపిస్తున్నాం. వీటితోపాటు లవ్, సెంటిమెంట్, కామెడీ, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్‌తో పాటు మంచి సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం' అని తెలిపారు.