Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా 'మెరిసే మెరిసే' చిత్రానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలను బాగా ఎంజారు చేస్తున్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది' అని చెబుతోంది కథానాయిక శ్వేతా అవస్తి. 'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన చిత్రం 'మెరిసే మెరిసే'.
కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా కథానాయిక శ్వేతా అవస్తి శనివారం మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
'మళ్లీ మళ్లీ చూశా' తర్వాత నటించిన రెండవ సినిమా 'మెరిసే మెరిసే'. దినేశ్ తేజ్ నటించిన 'హుషారు', 'ప్లేబ్యాక్' సినిమాలు మంచి ఆదరణ పొందాయి. తను మంచి కోస్టార్. డైలాగ్స్ చెప్పే సమయంలో భాష పరంగా బాగా హెల్ప్ చేశాడు. ఈ సినిమా ద్వారా నటిగా చాలా విషయాలను నేర్చుకున్నాను. డైరెక్టర్ పవన్ మంచి టాలెంటెడ్ పర్సన్.
దర్శకుడిగా తొలి సినిమానే అయినా కూడా ఫుల్ క్లారిటీతో సినిమాని తెరకెక్కించాడు. ఓ యాక్టర్ నుంచి తనకి కావాల్సిన అవుట్‌పుట్‌ను ఎలా రాబట్టుకోవాలో ఆయనకు మంచి ఐడియా ఉంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చే హీరోయిన్ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. తనకు లైఫ్‌లో ఏదో పెద్దగా సాధించాలనే కోరిక ఉంటుంది.
ఇలా.. నా పాత్రను డైరెక్టర్ డిజైన్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. నిజ జీవితంలో కూడా నేను ఎక్కువగా చెప్పాలనుకున్న విషయాలను ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎక్కువగా, మాటలతో తక్కువగా చెబుతాను. సినిమాలో హీరోయిన్ వెన్నెల పాత్ర కూడా అంతే. ఉత్తరాది ప్రేక్షకుల కంటే దక్షిణాది ప్రేక్షకులు సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక్కడ స్టార్స్‌ను ఆరాధిస్తారు. ఇక్కడ సినిమా అంటే ఎమోషన్, సెలబ్రేషన్. 'మహానటి' చిత్రంలో కీర్తిసురేష్ అద్భుతంగా నటించారు. ఓ నటిగా అలాంటి వైవిధ్యమైన పాత్రలను చేయాలని ఉంది. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నా. ఇప్పటికే లడక్‌లో చిత్రీకరణని పూర్తి చేశాం. అలాగే పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి' అని శ్వేతా అవస్తి తెలిపింది.