Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయకులుగా తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాజశేఖర్, సత్యదేవ్.. ఇద్దరూ శక్తివంతమైన ప్రతినాయకులుగా కనిపించబోతున్నట్టు సమాచారం. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఇందులో సత్యదేవ్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించబోతున్నారట. ఒరిజినల్ వర్షెన్‌లో వివేక్ ఒబెరారు పోషించిన పాత్రను సత్యదేవ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార, చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేష్ నటించనున్నారని వినిపిస్తోంది. అలాగే గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో సీనియర్ కథానాయకుడు రాజశేఖర్ సైతం పవర్ఫుల్ విలన్‌గా వెండితెరపై మెరవబోతున్నారట.