Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్, 'ఆటగాళ్లు' ఫేమ్ దర్షణ బానీక్ జంటగా తెరకెక్కుతున్న క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ 'బ్లాక్'. మహంకాళీ మూవీస్ బ్యానర్ పై జీబి కష్ణ దర్శకత్వంలో మహంకాళీ దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది.
'వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆది సాయికుమార్ లేటెస్ట్గా 'బ్లాక్' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. 'బ్లాక్' అనే క్యాచీ టైటిల్‌ని ఈ సినిమాకి ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై అటు ప్రేక్షకుల్లోను, ఇటు ఇండిస్టీ ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అసక్తి క్రియేట్ అయింది. అలాగే పవర్ఫుల్ పోలీస్‌గా ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్‌తో విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్ లభించింది. ఇక తాజాగా రిలీజైన టీజర్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. 'విధి ఆడిన వింత నాటకంలో శత్రువు కనిపించడు. మరి నేను వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు?', 'అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి డైలాగ్‌లు చెప్పి, ఫైట్ చేయడానికి నేనేమైనా పూరీ జగన్నాథ్ సినిమాలో హీరోనేంట్రా' అని టీజర్లో ఆది చెప్పిన డైలాగ్‌లకు, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు ఈ టీజర్లో ఉన్న యాక్షన్ షాట్స్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కట్స్‌తో రిలీజైన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఆమని, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మందా, పథ్వీరాజ్, సత్యంరాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. అతి త్వరలోనే భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆడియో మార్కెట్లోకి విడుదలవుతోంది' అని చిత్ర బృందం తెలిపింది.ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి, ఎడిటిర్ : అమర్ రెడ్డి, ఆర్ట్ : కేవి రమణ, డిఓపి : సతీష్ ముత్యాల, నిర్మాత : మహంకాళీ దివాకర్, దర్శకత్వం : జీబి కష్ణ.