Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరోయిన్ పూర్ణ టైటిల్ పాత్ర పోషించిన చిత్రం 'సుందరి'. అర్జున్ అంబటి హీరోగా, కళ్యాణ్. జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 13న ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత రిజ్వాన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, 'మా సినిమా చాలా బాగా వచ్చింది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. 'సుందరి' పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్లని కూడా అప్రోచ్ అయ్యాం. కథాపరంగా డైలాగ్స్ తక్కువగా మాట్లాడి, ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే హీరోయిన్ కావాలి. ఫైనల్‌గా పూర్ణని కలవడం, ఆమె ఓకే చెప్పడంతో సినిమాని స్టార్ట్ చేశాం. పూర్ణ పాత్రలో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. ఆమె పాత్రతో ఆడియెన్స్ ట్రావెల్ అవుతారు. దర్శకుడు చెప్పిన పాయింట్‌ని ఇంత వరకు ఎవరూ టచ్ చేయలేదు. డిఫరెంట్ క్లైమాక్స్‌తో తెరకెక్కించాం. అందుకే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నాం. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సినిమా బోల్డ్‌గా ఉండదు. దర్శకుడు చెప్పిన దానికంటే ఇంకా బాగా తీశారు. సురేశ్ బొబ్బిలి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలు, నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి. సినిమాలు చూసి బావుంటే తప్ప ఓటీటీలు హక్కులను కొనడం లేదు. ఒకవేళ కొన్నా, నిర్మాత ఖర్చు పెట్టినంత ఇవ్వడం లేదు. బడ్జెట్లో సగం కంటే తక్కువకు ఇస్తావా అని అంటున్నారు. ఇలా అయితే కొత్త నిర్మాతలు ఎలా వస్తారు?. అందుకే మా చిత్రాన్ని థియేటర్లలో ఈనెల 13న రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. కుటుంబం అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌దేవ్ 'సూపర్‌మచ్చి' సినిమాని రిలీజ్ చేస్తాం. సప్తగిరితో సినిమాతోపాటు రెండు పెద్ద సినిమాలను ప్లాన్ చేశాం' అని తెలిపారు.