Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కనబడుటలేదు'. బాలరాజు. ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 13న విడుదలవుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై, బిగ్ టిక్కెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ,''కనపడుట లేదు' టైటిల్ నన్నెంతగానో ఇన్స్పైర్ చేసింది' అని అన్నారు. స్పార్క్ ఓటీటీ అధినేత, నిర్మాత సాగర్ మంచనూరు మాట్లాడుతూ, 'మధు పొన్నాస్ సంగీతం, ఇన్నోవేటివ్‌గా ఉన్న టీజర్ చూసిన తర్వాత కథలో చాలా బలం ఉందనిపించింది. దీంతో సినిమాని ఇంకా పెద్ద లెవల్లో చేయాలని సునీల్, హిమజ, రవివర్మని తీసుకున్నాం. సునీల్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లారు' అని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, 'దర్శకుడు బాలరాజ్ ఈ చిత్రానికి 'కనబడుట లేదు' అనే టైటిల్ ఎందుకు పెట్టాడనేది సినిమా చూడాల్సిందే. స్పార్క్ సాగర్లాంటి నిర్మాత దొరకడం ఈ టీమ్‌కి అదష్టం' అని చెప్పారు.