Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం 'ఎస్.ఆర్. కళ్యాణమండపం ఇస్టిడి 1975'. నూతన దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో ప్రమోద్, రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'ప్రతి తండ్రీ కొడుకు మా సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో నిన్నటి నుండి మరిన్ని థియేటర్స్ పెంచాం. ఓవర్సీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని చెప్పారు. 'థియేటర్ల యజమానులకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ ఇలాంటి కరోనా పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నమ్మి, మా సినిమాని విడుదల చేసినందుకు ధన్యవాదాలు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మా సినిమా ద్వారా మరోసారి నిరూపించారు. ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చి మా సినిమా చూస్తున్నారు. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు' అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు.