Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నాచెల్లెళ్ళుగా నటిస్తున్న చిత్రం 'బ్రో'. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో జెజెఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.జె.ఆర్. రవిచంద్ నిర్మిస్తున్న చిత్రమిది. కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ, 'హీరోయిన్ రష్మిక మందన్న లాంచ్ చేసిన ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. నవీన్ చంద్ర, అవికాగోర్ లుక్ చూసి చాలా మంది కథేంటని ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇందులో వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళుగా నటిస్తున్నారని చెప్పడంతో ఆశ్చర్య పోతున్నారు. అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగే ఓ మంచి ఎమోషనల్, ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రమిది. హీరోయిన్గా గ్లామర్ రోల్స్‌లో నటించే అవికాగోర్ నవీనచంద్రకు చెల్లెలుగా నటించడానికి ఒప్పుకోవడం, అలాగే ఎన్నో మంచి మంచి హిట్లు ఇచ్చిన నవీన్ చంద్ర హీరోయిన్‌కు అన్నయ్యగా చేయడానికి అంగీకరించడం విశేషం. హీరో, హీరోయిన్గా చేసే వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళుగా నటించడానికి ఒప్పుకున్నారంటే ఈ కథ ఎంత బలమైందో వేరే చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని వైజాగ్, పరిసర అందమైన ప్రదేశాలలో చిత్రీకరణ చేశాం. మంచి విజువల్స్, మ్యూజిక్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి' అని తెలిపారు.
సంజన సారథి, సాయి రోనక్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ : అజీమ్ మహ్మద్, సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర, ఎడిటర్ : విప్లవ్ నైషాదం, సాహిత్యం : భాస్కరభట్ల, ఆర్ట్స్ : ఏ.యస్. ప్రకాష్, కొరియోగ్రఫీ : భాను, అనీష్, పథ్వీ, యాక్షన్ : రియల్ సతీష్.