Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫస్ట్‌లుక్ ఆవిష్కరణలో కృష్ణ
నటశేఖర కష్ణ, విజయనిర్మల కుటుంబం నుంచి శరణ్‌కుమార్ హీరోగా పరిచయం అవుతూ ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. శివ కేశన కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా ఎం. సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం) మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని హీరో లుక్‌ను ఆదివారం కష్ణ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కష్ణ మాట్లాడుతూ, 'శరణ్ హీరోగా చేస్తున్న సినిమా హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది తనకు హీరోగా పర్ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుంది. శరణ్ యాక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'శరణ్‌కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమా హీరో లుక్ పోస్టర్‌ను మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ కష్ణగారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. కృష్ణగారు రిలీజ్ చేసిన హీరో లుక్ పోస్టర్‌కి మంచి స్పందన లభిస్తోంది. సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తున్న శరణ్‌కు ఈ సినిమా కచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. అలాగే నరేష్, జయసుధ, సుధీర్‌బాబు మా టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించడం హ్యపీగా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఓ మంచి కంటెంట్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్ని ఉన్న చిత్రమిది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేస్తాం. అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ: బేబీ లలిత, సినిమాటోగ్రఫీ: చైతన్య కందుల, మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో, ఆర్ట్: కె.వి.రమణ, ఎడిటర్: సెల్వ కుమార్.