Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న విషయం విదితమే. ఆదివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'పుష్ప' చిత్ర బృందం ప్రత్యేకంగా ఓ పోస్టర్ని విడుదల చేసింది. 'ఎవిల్ వాజ్ నెవర్ సో డేంజరస్' అనే క్యాప్షన్‌తో తీక్షణంగా చూస్తున్న పహాద్ ఫాజిల్ ఒంటి కన్నుతో డిజైన్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. అలాగే ఈ సినిమాలో పహాద్ పాత్ర ఎలా ఉండబోతోందో దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో పోస్టర్లో చూపించారు. దీంతో పుష్పరాజ్ (అల్లుఅర్జున్) ఓ పవర్ఫుల్ ప్రతినాయకుడితో ఢ కొట్టబోతున్నారని ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి పార్ట్ 'పుష్ప 1' క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
ఈనెల 13న 'దాక్కో దాక్కో మేక..' అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్‌ను ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. 'అర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ధనుంజరు, సునీల్, రావు రమేష్, అజరు ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా, సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రామకష్ణ, మోనిక నిగొత్రే, సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, ఫె˜ౖట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, పాటలు : చంద్రబోస్.