Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్వక్సేన్, నివేదా పేతురాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం 'పాగల్'. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నాయిక నివేదా పేతురాజ్ సోమవారం మీడియాతో ముచ్చటించింది.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..'డైరెక్టర్ నరేష్ ఈ కథని నెరేట్ చేయగానే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. చిత్రీకరణ పూర్తయిన తర్వాత నేను సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. సినిమా అంతా లవ్ ఫీల్‌తోనే ఉంటుంది. 'సఖి' సినిమాలో మాధవన్, షాలిని మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో, అలాంటి ఎమోషన్స్ మా సినిమాలోనూ ఉంటాయి. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో నా పాత్ర పేరు తీర. నా పాత్రని దర్శకుడు డిజైన్ చేసిన తీరుకి అందరూ ఫిదా అయిపోతారు. హీరో విష్వక్ సేన్ బాగా యాక్ట్ చేశాడు. 'అర్జున్ రెడ్డి' మ్యూజిక్ విన్నప్పటి నుంచి రధన్కు పెద్ద ఫ్యాన్‌గా మారాను. ఈ సినిమాకి తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. ఇందులో ఆరేడు సాంగ్స్ ఉన్నాయి. అందులో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ నాకు బాగా నచ్చింది. నిర్మాతలు దిల్‌రాజు, బెక్కెం వేణుగోపాల్ చాలా బాగా చూసుకున్నారు. తెలుగులో మరో కొత్త సినిమా చేయబోతున్నాను. అలాగే తమిళంలో మూడు సినిమాలకు గ్రీన్‌సిగల్ ఇచ్చాను' అని నివేదా పేతురాజ్ చెప్పింది.