Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సరికొత్త కంటెంట్‌తో నవ్య చిత్రాలను ప్రేక్షకులకు అందిం చాలనే లక్ష్యంతో లేడీ లయన్ క్రియేషన్స్ స్థాపించి పలు సినిమాల నిర్మాణానికి రూపకల్పన చేశాం. ముఖ్యంగా నవతరాన్ని చైతన్య పరిచే దిశగా భిన్న చిత్రాలను నిర్మిస్తాం' అని అంటున్నారు నిర్మాత జి.ఆర్.జి.ఎన్.రాజు. లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నిర్మాత కె.ఎస్.రామారావు, రమేష్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వీర శంకర్, తెలంగాణ సాంస్కతిక శాఖ చైర్మన్ మామిడి హరికష్ణ, మాదాల రవి, నాగబాల సురేష్ కుమార్ పాల్గొన్నారు. బ్యానర్ లోగోను కె.ఎస్.రామారావు విడుదల చేయగా, టీజర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్.రామారావ్ మాట్లాడుతూ, 'లేడి లయన్ అనే బ్యానర్ మొదలెట్టి నిర్మాత రాజు సరికొత్త తరహా చిత్రాలను నిర్మించేందుకు సిద్దమయ్యారు. సినిమా అంటేనే థియేటర్స్ అనుభూతి. మనం ఎన్నో గొప్ప సినిమాలను, గొప్ప డైలాగ్స్‌ని, గొప్ప నటీనటులను తెరపై చూసేసాం. అలాంటి గొప్ప ఫీలింగ్ ఇచ్చే థియేటర్స్‌లోనే సినిమాలు విడుదల అవ్వాలి. ఈ మధ్య ఓటీటీ అంటూ సినిమాలన్నీ అందులోనే విడుదల అవుతున్నాయి. కానీ నిజంగా సినిమా అనుభూతి థియేటర్స్‌లో తప్ప ఎందులోనూ రాదు' అని చెప్పారు.
నిర్మాత రాజు మాట్లాడుతూ, 'సినిమాలే కాకుండా ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌లను కూడా నిర్మిస్తున్నాం. చల్లా భాను కిరణ్ దర్శకత్వంలో మా తొలి ప్రయత్నంగా 'లవ్ యూ ఎనిమి' అనే వెబ్సిరీస్ని త్వరలోనే విడుదల చేస్తున్నాం' అని అన్నారు. 'రాజుగారు కొత్త టాలెంట్‌ని పరిచయం చేసేందుకు ఈ బ్యానర్‌ని మొదలెట్టారు. నా దర్శకత్వంలో రూపొందిన 'లవ్ యూ ఎనిమి' వెబ్ సిరీస్ చాలా వినూత్నంగా ఉంటుంది' అని దర్శకుడు చల్లా భాను కిరణ్ తెలిపారు. ఈ బ్యానర్‌కి సహనిర్మాతగా గోవింద రాజులు వ్యవహరిస్తున్నారు.