Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో 'ఆర్ ఎక్స్ 100', 'మన్మధుడు2', 'ఆదిత్య 369', '7' సినిమాలతో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ మంచి పేరు సొంతం చేసుకున్నారు చైతన్ భరద్వాజ్. తాజాగా 'ఎస్.ఆర్ కళ్యాణమండపం' సినిమా పాటలతో సంగీత ప్రియుల మనసుల్ని దోచుకున్నారు. సంగీత పరంగా 'ఎస్.ఆర్ కళ్యాణమండపం' సాధించిన విజయానందాన్ని సోమవారం చైతన్ భరద్వాజ్ మీడియాతో షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమాలో ఉన్న మూడు డిఫరెంట్ సాంగ్స్‌కి కంపోజింగ్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. హీరో కిరణ్ అబ్బవరం సూచన మేరకు హీరో ఇంట్రడక్షన్ సీన్‌కు ఆల్ ఓల్డ్ సాంగ్స్ డి.జె. మిక్సింగ్ చేశాను. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా కిరణ్ ఐడియాలజీతో చేశాం. కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం కిరణ్‌కే చెందుతుంది. ఈ సినిమాలోని పాటలు ఇంత పెద్ద హిట్ అవడానికి చిత్ర దర్శకుడు, నిర్మాతలు ప్రమోద్, రాజు, హీరోలే ప్రధాన కారణం. వీరికి ఉన్న మంచి అభిరుచి వల్లే ఈ సినిమా ఆడియో ఇంత పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం అజరు భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహా సముద్రం' సినిమాకి సంగీతం సమకూరుస్తున్నాను. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని 'రంభ రంభ' సాంగ్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను చేయబోయే మరిన్ని ప్రాజెక్ట్‌ల విశేషాల గురించి త్వరలోనే తెలియజేస్తాను' అని చెప్పారు.-