Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నట్టిక్రాంతి హీరోగా నటించిన చిత్రం 'సైకో వర్మ' (వీడు తేడా). నట్టికుమార్ దర్శకుడు. సుపూర్ణ మలాకర్, ముస్కాన్ కథానాయికలు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో, అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. విడుదలైన కొద్ది గంటల్లోనే దీనికి విశేషమైన స్పందన లభించింది.
ఈ సందర్భంగా నిర్మాత నట్టి కరుణ మాట్లాడుతూ, 'ఓ సాఫ్ట్వేర్ కుర్రాడి జీవితంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హీరో నట్టి క్రాంతి తన పాత్రకు ప్రాణం పోశాడు. పాటలు కూడా అందర్నీ అలరిస్తాయి. మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రఫీ: జనార్దన్ నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి.రమణ, ఫైట్స్: వింగ్ చున్ అంజి.